Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2016 12:18:12
facebook Twitter Googleplus
Photo

ఓ మూవీ రిజల్ట్ ని ముందే ఊహించడం కష్టం. దర్శకుడు చెప్పే స్టోరీ లైన్ ప్రకారం.. ఔట్ పుట్ ఊహించుకుని సినిమాని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సినిమాల విషయంలో అదే పెద్ద రిస్క్. కానీ రీమేక్స్ విషయంలో ఆ సమస్య ఉండదు. ఎదురుగా ఓ వెర్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎంతగా లోకలైజ్ చేసుకుంటే.. అంతగా సక్సెస్ కొట్టచ్చనే ధీమా ఉంటుంది. కానీ దగ్గుబాటి రానా ఇలా తన దగ్గరకు వచ్చిన ఓ రీమేక్ ని తిరస్కరిస్తే.. దాని డబ్బింగ్ వెర్షన్ బ్లాక్ బస్టర్ అయిపోయింది.

విజయ్ యాంటోనీ హీరోగా వచ్చిన కోలీవుడ్ డబ్బింగ్ మూవీ బిచ్చగాడు.. ఇప్పుడు టాలీవుడ్ లో 10 కోట్ల వసూళ్లతో సంచలన విజయం సాధించేశాడు. నిజానికి పిచ్చైక్కారన్ ను తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. ఇందుకోసం ఒరిజినల్ కి సంబంధించిన డీవీడీ పట్టుకుని.. టాలీవుడ్ హీరో కం విలన్ దగ్గుబాటి రానా దగ్గరకు వచ్చాడు. మూవీ ఇంట్రెస్టింగ్ గా అనిపించినా.. కన్విన్స్ కాలేకపోయాడు రానా. బిచ్చగాడి కేరక్టర్ ఇక్కడ సెట్ కాదని ఫీలయిన రానా.. చివరకు రీమేక్ లో నటించేందుకు నో అనేశాడు. అలా తను చిన్నచూపు చూసి ఆ సినిమా.. ఇప్పుడు సెన్సేషనల్ హిట్ సాధించేసింది.

రానా నుంచి ఇలాంటి ఆన్సర్ రావడంతో.. 50 లక్షలకు డబ్బింగ్ రైట్స్ అమ్మేసింది యూనిట్. అలా బిచ్చగాడుగా తెలుగులోకి వచ్చాడు విజయ్ ఆంటోనీ. తెలుగులో ఓ భారీ సక్సెస్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. ఈ చిత్రాన్ని రానా మిస్ అయిపోయాడే అనిపించడం కరెక్ట్ కాకపోయినా.. ఇలాంటి డిఫరెంట్ చిత్రంలో చేసి ఉంటే.. మనోడి కెరీర్ లో ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోయేదని అనాల్సిందే.

,  ,  ,  ,  ,  ,  ,