Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2017 16:55:42
facebook Twitter Googleplus
Photo

దగ్గుబాటి రానా కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు మంచి ఊపుమీదుంది. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్రతో మన దగ్గరే కాదు.. మొత్తం దేశంలోనే రానా పేరు మార్మోగుతోంది. బాహుబలిలో హీరో ప్రభాస్ కు దీటుగా కండలు మస్కులర్ బాడీతో ఆకట్టుకున్న అతడికి ఈ మధ్య లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. సినిమాలతో పాటు హీరోయిన్లతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంలోనూ రానా పేరు ముందే వినిపిస్తుంది. గతంలో చెన్త్నై సుందరి త్రిషతో కలిసిమెలిసి తిరుగుతున్నాడని వార్తల్లోకెక్కాడు. అబ్బే అలాంటిదేం లేదని కొట్టిపారేసినా గాసిప్స్ కాలంలో వీళ్లిద్దరి పేర్లే హైలైట్ అయ్యేవి.

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ఒకడైన రానా ఇప్పుడు రూటు మార్చి మరో స్టార్ హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడన్నది టాలీవుడ్ వర్గాల మాట. పంజాబ్ నుంచి హైదరాబాద్ వచ్చి తెలుగులో అగ్రస్థాయికి చేరిన అందాల సుందరి రకుల్ ప్రీత్ తో రానాకు సాన్నిహిత్యం పెరిగిందనేది టాక్. దీనిపై అడిగితే మళ్లీ ఎప్పటిలాగే అబ్బే అలాంటిదేం లేదని పాతపాటే పాడుతున్నాడు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్ పైనే ఉంది. ఇన్నాళ్లకు కెరీర్ సరైన గాడిలో పడిందని భావిస్తున్నా. దీనిని జాగ్రత్తగా కొనసాగించాలనుకుంటున్నా. ఈ టైంలో ఎవరితోనూ సీరియస్ రిలేషన్ షిప్ మెయిన్ టెయిన్ చేసే తీరిక లేదు అంటున్నాడు మన భళ్లాలదేవుడు. అంతేనంటావా రానా.. ఎట్టెట్టా.. ప్చ్!!

రానా ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేస్తున్నాడు

,  ,  ,  ,  ,