సంజయ్ దత్ జీవితమే ఒక సినిమాలా కనిపిస్తుంది. తన చిన్నప్పుడే తల్లి నర్గీస్ చనిపోయింది. తను డ్రగ్స్ కి అలవాటుపడి జైలుకి కూడా వెళ్ళాడు. మనశ్శాంతి కోల్పోయాడు. తర్వాత భార్య కేన్సర్ తో చనిపోయింది. మళ్లీ పెళ్లి చేసుకున్నాడు... ఇంతలోనే అక్రమ ఆయుధాలు కలిగివున్నాడన్న కేసులో ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. ఇలా అతని జీవితమంతా కష్టాలు, కన్నీళ్లే! అతని జీవితం ఒక సినిమా కథలా సాగిపోతుంది. అందుకే, ఇప్పుడీ కథను నిజంగానే వెండితెరకు ఎక్కిస్తున్నారు.
ranbirkapoor, sanjaydutt, bollywoo, news,