Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2017 11:08:52
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ.. అల్లు అర్జున్ లతో లెజెండ్.. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఆశ్చర్యకరంగా బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో సినిమా చేస్తున్నాడు బోయపాటి శ్రీను. గత ఏడాది చివర్లో మొదలైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బోయపాటి స్టయిల్లో భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. హైదరాబాద్ లో సుదీర్ఘంగా సాగిన షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. దీంతో షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాకు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారట. సినిమాను వేసవి చివర్లో విడుదల చేయాలన్న ప్లాన్లో ఉన్నాడు బోయపాటి.

ఈ నెల 21 నుంచి దివిసీమ ప్రాంతంలోని హంసలదీవిలో చివరి షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నాడు బోయపాటి. అక్కడ సముద్ర తీరంలో భారీ సెట్టింగ్ వేసి ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడట. అంతటి తో సినిమా దాదాపుగా పూర్తయినట్లే అంటున్నారు. వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి మే నెలాఖర్లో లేదా జూన్ ప్రథమార్ధంలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరో బెల్లంకొండే అయినా.. ఖర్చు విషయంలో ఏమీ రాజీ పడట్లేదు. ఓ స్టార్ హీరో సినిమా స్థాయిలో ఖర్చు పెట్టిస్తున్నాడు బోయపాటి. ఇందులో శరత్ కుమార్.. జగపతిబాబు.. రకుల్ ప్రీత్ సింగ్.. ప్రగ్యా జైశ్వాల్.. ఇలా భారీ తారాగణమే ఉంది.

,  ,  ,  ,  ,