Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2017 11:26:10
facebook Twitter Googleplus
Photo

చరణ్-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి ఏడెనిమిది నెలలవుతోంది. ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. అప్పుడప్పుడూ ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని రిలీజ్ చేశారు తప్పితే.. ఇప్పటిదాకా అఫీషియల్ లుక్ ఏదీ బయటికి రాలేదు. మెగా అభిమానులు ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఎట్టకేలకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ కోసం ముహూర్తం కుదిరినట్లు సమాచారం. దసరా కానుకగా రంగస్థలం తొలి చూపును పరిచయం చేస్తారట. ఇందులో సుకుమార్ మార్కు ఉంటుందని.. కచ్చితంగా మెగా అభిమానుల్ని ఈ లుక్ అలరిస్తుందని అంటున్నారు.

రంగస్థలం ఫస్ట్ లుక్ ను చరణ్ బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఐతే గత కొన్నేళ్లుగా తన ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన ఏ వేడుకలకూ రాని పవన్.. చరణ్ ఫస్ట్ లుక్ లాంచ్ కోసం ఒప్పుకుంటాడా అన్నది సందేహం. చివరగా పవన్.. చరణ్ నాయక్ సినిమా ఆడియోను లాంచ్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరెక్కుతున్న రంగస్థలం 1985 ను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. ఐతే ఈ మధ్య కొంచెం సందేహాలు మొదలయ్యాయి. మరి ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా రిలీజ్ విషయంలో క్లారిటీ ఏమైనా ఇస్తారేమో చూడాలి.

,  ,  ,  ,  ,