Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 15:26:54
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు తన కెరీర్ లోనే కాదు.. ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫేజ్ లో ఉన్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికి వరుసగా మూడు సినిమాలను 50 కోట్ల మార్క్ దాటించిన ఏకైక హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఈ మెగా హీరో ఇప్పటికే సరైనోడు సినిమాని కంప్లీట్ చేసేశాడు. సెన్సార్ కూడా చేయించేశారనే టాక్ ఉంది. అందరూ చూసే యూ/ఏ సర్టిఫికేట్ మూవీ అంటే వైజాగ్ లో ఓ హింట్ కూడా ఇచ్చాడు అల్లు అర్జున్.

ఈ స్టైలిష్ స్టార్ తన తరువాతి సినిమాల విషయంలో ఉన్న ప్లానింగ్ చూస్తే ఎవరికైనా ముచ్చటేయక మానదు. ప్రస్తుతం ఈ మెగా హీరో మూడు సినిమాలను ఓకే చేసేశాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా లింగుస్వామి దర్శకత్వంలో తమిళ్- తెలుగు బై లింగ్యువల్ మూవీ - మనం - 24 ఫేం విక్రమ్ కే కుమార్ లతో సినిమాలకు ఒప్పుకున్నాడు అల్లు అర్జున్. రీసెంట్ గా 24ను ఫినిష్ చేసిన విక్రమ్ కుమార్ బన్నీ కోసం స్క్రిప్టును పూర్తి చేయడానికి నాలుగు నెలల టైం అడిగాడు. దీంతో నవంబర్ నుంచి ఈ దర్శకుడితో సినిమా స్టార్ట్ చేసేందుకు డిసైడ్ అయ్యాడు అల్లు వారబ్బాయి.

ఈలోగా త్రివిక్రమ్ తో కానీ లింగుస్వామితో కానీ మూవీ ఫినిష్ చేసేసే యోచనలో ఉన్నాడు అల్లు అర్జున్. ఒకవేళ త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ మూవీ ఫిక్స్ అయితే మాత్రం.. అప్పుడు బన్నీకి లింగుస్వామి ఒకడే ఆప్షన్ అవుతాడు. అయితే.. ఏదో ఒక సినిమానైతే మాత్రం మే నెల ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టేస్తాడట అల్లు అర్జున్. బన్నీ ఐడియాలజీ చూస్తే.. వాటే ప్లానింగ్ గురూ అనాల్సిందే కదూ.

,  ,  ,  ,  ,