Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2015 11:09:08
facebook Twitter Googleplus
Photo

పట్టుచీర కట్టకపోయినా .. పసిడి నగలు పెట్టకపోయినా .. ఎప్పుడూ కొత్త పెళ్లికూతురులా సిగ్గుపడిపోతూ కనిపించే కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. తమలపాకులా నాజూకుగా కనిపించే ఈ సుందరి ఇప్పుడు యమాబిజీ అయిపోయింది. అవకాశాలు జారిపోకుండా చూసుకోవడంలో అమ్మడి స్పీడు చూసి, మిగతా కథానాయికలు బిత్తరపోతున్నారట. ఇక అలసట .. విసుగు అనేది లేకుండా షూటింగులో ఆమె చూపించే ఉత్సాహం చూసి కథానాయకులు కాంప్లిమెంట్లు ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు. అలాగే రవితేజ కూడా ఆమె పనితీరుని చూసి అభినందించాడు.

తాను కూడా పరిశ్రమకి వచ్చిన కొత్తలో నిలదొక్కుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాననీ, ఇప్పటికీ అదే పద్ధతిని పాటిస్తున్నానని చెప్పాడు. ఆమె తపన చూస్తుంటే తనకి ఆ రోజులు గుర్తొస్తున్నాయనీ, ఆమెలోని కష్టపడే తత్వమే తనకి బాగా నచ్చిందంటూ అభినందించాడు. ఆ ప్రశంస తనకి మరింత ప్రోత్సాహం ఇచ్చిందనీ, ఉత్సాహంతో కూడిన ఉత్తేజాన్ని ఇచ్చిందని రకుల్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటూ ఫేస్ అలా క్వశ్చన్ మార్కులా పెట్టొద్దు .. కిక్ 2 సినిమాలో రవితేజ జోడీ కట్టింది రకుల్ ప్రీతే కదా!

,  ,  ,  ,  ,  ,  ,