వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వా.. రొటీన్ మసాలా కంటెంట్ తో రాధ మూవీ చేశాడు. ఈ మూవీకి టాక్ సంగతి ఎలా ఉన్నా.. శర్వా ట్రాక్ రికార్డ్ బాగుండడం.. సమ్మర్ కలిసి రావడంతో ఓపెనింగ్స్ ఓకె అనిపించి.. ఫైనల్ గా ఫ్లాపు అనిపించుకుంది. క్లాస్ ఇమేజ్ ఉన్న శర్వానంద్ ను.. రాధ మూవీలో ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేదనే చెప్పాలి.
ఫైటింగ్స్ గట్రా చేసేస్తూ మాస్ మసాలా కంటెంట్ చూపిస్తే.. ఆడియన్స్ ఒప్పుకోగలరా లేదా అనే విషయంపై ఇంకా కన్ఫూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే.. ఎలాంటి సీన్స్ అయినా పండించే ట్యాలెంట్ ఉన్న శర్వానంద్.. మళ్లీ ఫైటింగ్స్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ మహానుభావుడు అనే మూవీ చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను పిక్చరైజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ హీరో ఫైటింగుల మాదిరిగా కాకుండా.. హెవీగానే ఉంటాయట ఈ ఫైటింగ్స్.
మారుతి డైరెక్షన్ కావడం.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణం కావడంతో.. మహానుభావుడుపై ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది.