Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Sep-2016 12:57:09
facebook Twitter Googleplus
Photo

బెంగాళ్ టైగర్ సినిమాతో మంచి విజయం సాధించినా.. ఆ తరువాత సినిమాను అంగీకరించటానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు సెట్స్ మీదకు వచ్చినట్టుగా వచ్చి ఆగిపోయాయి. అయితే అఫీషియల్గా మాత్రం ఒక్క సినిమా కూడా ఎనౌన్స్ కాలేదు. త్వరలో పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో రవితేజ సినిమా ఉంటుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త మాస్ మహరాజ అభిమానులకు కిక్ ఇస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రవితేజ సినిమాకు క్రాక్ అనే టైటిల్ను ఫైనల్ చేశారట. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. రవితేజ బాడీలాంగ్వేజ్కు ఈ టైటిల్ పర్ఫాక్ట్ అని ఫీల్ అవుతున్నారు. మరి ఈ సినిమాపై అయినా త్వరలో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి.

,  ,  ,  ,  ,  ,