Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2015 18:01:14
facebook Twitter Googleplus
Photo

సెంచరీ ఒక్క సినిమా దూరంలో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. ఐతే ఆయన 99వ సినిమా కూడా వందో సినిమా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. వందో సినిమాకు సరైన ఫ్లాట్ ఫామ్ రెడీ చేయాలన్న ఉత్సాహంతో క్రేజీ కాంబినేషన్లో పని చేస్తున్నాడు బాలయ్య. ?లౌక్యం? లాంటి సూపర్ హిట్ కొట్టి ఊపు మీదున్న శ్రీవాస్ దర్శకత్వంలో కోన వెంకట్ - గోపీమోహన్ - శ్రీధర్ సీపాన - రత్నం లాంటి నలుగురు ఫేమస్ రైటర్లు రాసిన కథతో ?డిక్టేటర్? లాంటి పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ శ్రీవాస్ తో కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్ కూడా భారీగా చేసి సినిమా మీద హైప్ మరింత పెంచాలని చూస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఆడియో ఫంక్షన్ ను నభూతో అనే స్థాయిలో చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో లక్ష మంది సమక్షంలో ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారట. డిసెంబరు 20న ఆడియో విడుదల కాబోతుండగా.. నెల రోజుల ముందు నుంచే అందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా ఎందో రాజకీయ సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారట. భారీ స్థాయిలో వేదిక నిర్మించి.. ఓపెన్ ఏరియాలో ప్రాంగణాన్ని తెలుగుదనం ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్ది వేడుకను నభూతో అన్న రీతిలో నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఇటీవలే డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ శ్రీవాస్ ఆ ఏర్పాట్లను కూడా పరిశీలించి వచ్చాడు. త్వరలోనే బాలయ్య కూడా అక్కడికి వెళ్తున్నాడు.

,  ,  ,  ,  ,