Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2015 09:48:24
facebook Twitter Googleplus
Photo

తెరపై అల్లరిగా ... ఆకతాయిగా సందడి చేసే కథానాయకులలో రవితేజా పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సెంటిమెంట్ .. యాక్షన్ .. రొమాన్స్ .. కామెడీ .. ఇలా ప్రతి అంశంపై రవితేజా మార్కు కనిపిస్తుంది. అలాంటి రవితేజా నటించిన 'కిక్' చిత్రానికి అభిమానులు హిట్ ఇచ్చి పంపించారు. ఆ సినిమాకి సీక్వెల్ గా 'కిక్ 2' సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రవితేజా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.

గతంలో ఆయన 'విక్రమార్కుడు' సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఆ రెండు పాత్రల మధ్య ఎలాంటి సంబంధం వుండదు. కానీ ఈ సినిమాలో ఆయన తండ్రీకొడుకులుగా నటిస్తున్నాడు. ఈ పాత్రలలో వైవిధ్యంగా కనిపించడం కోసం రవితేజా చాలా కసరత్తు చేశాడని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ అందాలను కలుపుకుని మే మూడవ వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

,  ,  ,  ,  ,  ,  ,