Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2015 16:53:56
facebook Twitter Googleplus
Photo

ఈ రోజుల్లో ఏ సినిమా ఎందుకు వాయిదా పడుతుందో అర్థం కాదు. సడెన్ గా షాకులిచ్చేస్తుంటారు దర్శక నిర్మాతలు. వాయిదాల పర్వంలో చిన్న పెద్ద అనే తేడా లేదు. సూపర్ స్టార్ లు నటించిన సినిమాలు కూడా అనుకోని కారణాలతో వాయిదా పడిపోతుంటాయి. ఈ ఏడాది దాదాపుగా ప్రతి పెద్ద సినిమా కూడా వాయిదా పడ్డదే. ఇప్పుడా జాబితాలోకి ?కంచె? కూడా చేరబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కారణాలేంటన్నది తెలియడం లేదు కానీ.. అక్టోబరు 2కి కంచె రాకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ లో ఏమైనా లేటవుతోందా అనుకుందామంటే.. అలాంటి సూచనలేం కనిపించలేదు. అంత భారీ సినిమాను శరవేగంగా పూర్తి చేసిన క్రిష్.. చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నాడు. అంతా సాఫీగానే సాగుతున్నట్లు అనిపిస్తోంది. మరి సినిమాను ఎందుకు వాయిదా వేయాలనుకుంటున్నట్లో తెలియడం లేదు.

పోటీకి భయపడ్డారని అనుకోవడానికేమీ లేదు. ?కంచె?ను చూసి వేరే సినిమాలు భయపడాలే తప్పితే ఆ సినిమా వేరే వాటికి భయపడే పరిస్థితి లేదు. కంచెతో పాటు అక్టోబరు 2న ?శివమ్? రిలీజవుతోంది. తర్వాతి వారం ?రుద్రమదేవి? వస్తుంది. ?కంచె?కు ముందు రోజు తమిళ ?పులి? వస్తోంది. వీటన్నింటిలోనూ ?కంచె?కే ఎక్కువ క్రేజ్ ఉందన్నది వాస్తవం. కాబట్టి వాయిదాకు రీజన్ ఏదీ కనిపించట్లేదు. ఏవైనా ఫైనాన్స్ వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నారో ఏమిటో?

,  ,  ,  ,