Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2017 12:06:05
facebook Twitter Googleplus
Photo

అంత్యక్రియల్లో కనిపించనంత మాత్రాన.. స్వయానా తమ్ముడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం ఏ అన్నకు అయినా పుట్టెడు దుఃఖం తప్పదు. భరత్ అంత్యక్రియలకు రాలేదంటూ.. రవితేజ మీద ఇప్పుడు విమర్శల వాన కురుస్తోంది. పాత సంగతులు వదిలేసి.. వచ్చుండాల్సింది కదా అనే మాట కూడా వినిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితిలో సినిమా షూటింగ్ అంటే చాలామంది సైడ్ అయిపోతారు. కనీసం పది మంది లోకి వచ్చే ధైర్యం కూడా చేయరు. కానీ రవితేజ మాత్రం ఈ విషయంలో పక్కా ప్రొఫెషనల్. తను డేట్స్ మిస్ చేస్తే.. నిర్మాతలకు ఎంత నష్టమో.. ఎంతమంది కాల్షీట్స్ వేస్ట్ అవుతాయో.. మళ్లీ అందరి డేట్స్ ను కలిపి సెట్ చేయడం ఎంత క్లిష్టమైన విషయమో రవితేజకు బాగానే తెలుసు. అందుకనే రవితేజ ఇప్పుడు తన సినిమా షూటింగ్ కి వచ్చేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా ది గ్రేట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు కూడా. ఆ సెల్ఫీ చూడండి.. మీకే అర్ధమవుతుంది.

ముందుగా ఇచ్చిన కమిట్మెంట్ కోసం.. బాధను దిగమింగుకుని పని చేస్తున్నాడు రవితేజ. తనలో బాధ ఉన్నా ఆ భావాలేవీ ఫేస్ లో కనిపించనీయడం లేదట.

,  ,  ,  ,