Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2017 10:47:42
facebook Twitter Googleplus
Photo

10 సంవత్సరాలు ఓ హీరోయిన్ కెరీర్ కంటిన్యూ అవడం.. అందులోనూ టాప్ రేంజ్ నిలబెట్టుకుంటూ ఇంత సుదీర్ఘ కాలం కొనసాగడం అంటే మాటలు కాదు. పాతరోజుల్లో సంగతి వేరు. ఇప్పుడు వారానికో కొత్త భామ పోటీకి వచ్చేస్తోంది. ఇంతటి పోటీలోనూ టాలీవుడ్ చందమామగా గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్.. దశాబ్ద కాలం నుంచి హీరోయిన్ గా వెలిగిపోతూనే ఉంది.

కాజల్ హీరోయిన్ గా నటించిన తొలి మూవీ లక్ష్మీ కళ్యాణం.. సరిగ్గా పదేళ్ల క్రితంకళ్యాణ్ రామ్ హీరోగా.. తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అది. ఆ వెంటనే కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన చందమామతో బ్రేక్ లభిస్తే.. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీసిన మగధీరతో టాప్ రేంజ్ కి వెళ్లిపోయింది. ఇప్పుడు తన సంతోషాన్ని.. అభిమానులతో పంచుకుంటూ తెగ సంబరపడిపోతోంది కాజల్ అగర్వాల్.

10ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి తెగ పోస్ట్ లు చేసేస్తోంది. రకరకాల భంగిమల్లో ఉన్న ఫోటోలతో పాటు.. 'నేను ఇంత శక్తివంతంగా మారడానికి కారణమైన కష్టాలకు చాలా కృతజ్ఞతలు. అవి లేకపోతే ఇంతదూరం వచ్చేదాన్ని కాదు. ఇలాగే మరింత కాలం కొనసాగిస్తాను. ఇంతే సంతోషాన్ని మరింత కాలం కంటిన్యూ చేస్తా లవ్ యూ ఆల్ అంటోంది కాజల్ అగర్వాల్.

,  ,  ,  ,  ,  ,