Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 17:40:14
facebook Twitter Googleplus
Photo

తమిళ దర్శకుడు టియన్ సంతోష్ తన తమిళ్ సినిమా ?కనిథన్? ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. రవితేజకున్న మాస్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని మాతృకలో దర్శకుడు కొన్ని మార్పులు చేసినట్టు తెలిసింది. అంతేకాక తెలుగులో రవితేజ తోనే ఆ సినిమా చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రవితేజ చేయబోతున్న ?రాబిన్ హుడ్? సినిమా తరువాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరం ఆఖరిలో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంతవరకూ తెలియనప్పటికీ తమిళ్ సినిమా నిర్మాత యస్. థాను మాత్రం ఈ సినిమాని తెలుగులో నిర్మిస్తాడని సమాచారం. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి.

,  ,  ,  ,  ,  ,  ,  ,