Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 15:06:13
facebook Twitter Googleplus
Photo

కంటెంట్ ఉన్న కథ రాసుకుంటే ఏ దర్శకుడికైనా ఒక హీరో మదిలో మెదులుతూ ఉంటాడు. కథ హీరోకి కరెక్ట్ గా సెట్ అయితే అక్కడే మొదటి విజయం అందుకున్నట్టు. ఇకపోతే ఆ తరహాలో కొంచెం స్పైసి గా ఉండే కథ ఏదైనా మదిలో మెదిలితే చాలు మొదట ఏ దర్శకుడికైనా గుర్తొచ్చే హీరో మాస్ మహారాజ రవితేజ. రాజా ది గ్రేట్ సినిమాతో దాదాపు ఫామ్ లోకి వచ్చిన రవితేజ మళ్లీ తన గత వైభవాన్ని చూపించాలని చూస్తున్నాడు.

ఇకనుంచి కొత్త కంటెంట్ తో ఉండే కథలను అలాగే తనకు సెట్ అయితేనే చేస్తానని రవితేజ పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలో మనోడు కొన్ని కథలను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రచయితగా వర్క్ చేసి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న విక్రమ్ సిరికొండ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ కథలో మరోసారి రవితేజ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. విక్రమార్కుడు - పవర్ సినిమాల్లో రవితేజ పోలీస్ పాత్రల్లో ఎంత ఎనర్జీటిక్ గా కనిపించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు మళ్లీ అదే తరహాలో టచ్ చేసి చూడు సినిమాలో అక్రమ రాజకీయాలను ఎదుర్కునే పోలీస్ పాత్రలో పవర్ఫుల్ క్యారక్టర్ తో కనిపించనున్నాడట. రీసెంట్ గా ఆ సినిమా లొకేషన్స్ లోని కొన్ని ఫొటోలు కూడా బయటపడటంతో మాస్ రాజా ఫ్యాన్స్ చాలా ఎక్సయిట్ అవుతున్నారు.

,  ,  ,  ,  ,