Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Dec-2015 17:59:34
facebook Twitter Googleplus
Photo

తెర మీద హీరోలు చాలా విన్యాసాలు చేసేస్తారు కానీ.. మనకు కనిపించేదంతా అబద్ధమని అందరికీ తెలుసు. యాక్షన్ సన్నివేశాల్లో డూపులతో వైర్లతో లాగించేస్తారన్న సంగతి తెలిసిందే. ఐతే ?బెంగాల్ టైగర్? సినిమా పోస్టర్లలో రవితేజ ఇద్దరు హీరోయిన్లను మోస్తున్న దృశ్యం చూసి ఇది కూడా అలాగే మేనేజ్ చేసి ఉంటారనే అనుకున్నారంతా. కానీ మాస్ రాజా నిజంగానే ఇద్దరు హీరోయిన్లను మోశాడని.. అలాగే డ్యాన్స్ కూడా చేశాడని.. పైగా అప్పటికి అతను 104 డిగ్రీల జ్వరం కూడా ఉందని చెప్పాడు డైరెక్టర్ సంపత్ నంది. అసలా పాటలో హీరోయిన్లను ఎత్తుకుని డ్యాన్స్ చేసే స్టెప్పు ఉందని కూడా తనకు తెలియదని సంపత్ చెప్పాడు.

??రవితేజ గారి ప్రొఫెషనలిజం గురించి అందరూ చెప్పుకుంటారు. నేను స్వయంగా చూశాను. బెంగాల్ టైగర్ లో ఓ పాట కోసం తమన్నా - రాశి ఖన్నాలిద్దరినీ మోస్తూ స్టెప్పు వేశారు. ఇద్దరు హీరోయిన్ల బరువును మోస్తూ కూడా నవ్వుతూ స్టెప్పులేయడం మామూలు విషయం కాదు. నిజానికి ఇలాంటి స్టెప్పు పాటలో వస్తుందని నాక్కూడా తెలియదు. సెట్ కు వెళ్లేసరికి జానీ మాస్టర్ ఈ స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇదేం స్టెప్ అని అడిగితే.. ?ఈ పాట కోసమే? అన్నారు. అది రవితేజకీ నచ్చింది. అప్పటికప్పుడు ఆ షాట్ తెరకెక్కించాం ఆ రోజు ప్యాకప్ చెప్పేసరికి రవితేజ గారికి 104 డిగ్రీల జ్వరం అని తెలిసింది. అంత జ్వరంలోనూ ఆ స్టెప్ ఎలా వేశారా అని ఆశ్చర్యపోయా?? అని సంపత్ చెప్పాడు.

,  ,  ,  ,