Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2015 11:05:12
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్న రవితేజ తాజాగా ఓ కన్నడ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించాడు. శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'వజ్రకాయ' సినిమాలో ఆయన ఓ పాటలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడు. దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం రవితేజ నిన్న షూటింగ్ చేశాడు. శివరాజ్ కుమార్ పై సాగే ఇంట్రడక్షన్ సాంగులో ఆయనతో పాటు మరికొందరు హీరోలు కూడా కనిపిస్తారు. వీరిలో ఒకరిగా రవితేజ నటించాడు. శివరాజ్ కుమార్ తో కలసి ఈ పాటలో రవి మాస్ స్టెప్స్ వేశాడు. ఇంకా ఈ పాటలో తమిళ హీరో శివ కార్తికేయన్, మలయాళ హీరో దిలీప్, కన్నడ స్టార్ రవిచంద్రన్ కూడా నటించారు.

,  ,  ,  ,