Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2016 13:45:52
facebook Twitter Googleplus
Photo

రవితేజ దాదాపు ఏడాది కాలంగా ఏ సినిమానూ చేయడం లేదు. ప్రాజెక్టు దశలోనే ఆగిపోవడం.. చర్చల దశలోనే ఆగిపోవడం.. అనౌన్స్ చేశాక ఆగిపోవడం.. నిర్మాతలు వెనక్కి తగ్గడంతో ఆగిపోవడం.. హీరో రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగాడని ఆగిపోవడం.. ఇలా రకరకాల రీజన్స్ ఉంటున్నాయి కానీ.. మాస్ మహరాజ్ కొత్త ప్రాజెక్ట్ పొజిషన్ మాత్రం అక్కడక్కడే ఉంటోంది.

రవితేజ తో పవర్ తీసి హిట్ కొట్టిన బాబీ.. సర్దార్ ఫ్లాప్ తర్వాత మళ్లీ మాస్ మహారాజ్ ఓ మూవీ మొదలుపెట్టాడని అన్నారు. కానీ ఇప్పుడీ ప్రాజెక్టు కూడా ఆగిపోయిందని తెలుస్తోంది. కాకపోతే ఈ సారి కారణం కొత్తగా ఉందంతే. బాబీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చినా.. పూర్తి స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఇప్పటికే రెండు మూడు సార్లు మార్పులు చేయించాడట మాస్ మహరాజ్. ఏది రవితేజకు నచ్చకపోవడంతో ఇప్పుడు ప్రాజెక్టునే పక్కన పెట్టేయాలని.. హీరో- డైరెక్టర్లు డిసైడ్ అయ్యారట.

మరోవైపు మూవీ క్యాస్టింగ్ విషయంలో.. ఆయా ఆర్టిస్టులు ఉండాలంటూ రవితేజ పట్టుబట్టడం కూడా.. ఆ ప్రాజెక్టును రద్దు చేయాలనే నిర్ణయానికి రావడానికి కారణంగా చెబుతున్నారు. హీరో చెప్పినట్లుగా తీసుకుంటే.. మూవీ బడ్జెట్ లో సగానికి పైగా అక్కడే సరిపోతుండడంతో.. రిజల్ట్ విషయంలో ప్రొడ్యూసర్లు బెంగ పెట్టేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి రవితేజ ఈ కొత్త ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేసినట్లే అని చెవులు తెగ కొరికేసుంటున్నారు సినీ జనాలు.

,  ,  ,  ,