Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Oct-2015 14:03:11
facebook Twitter Googleplus
Photo

కాలేజ్ లెక్చరర్ కి - స్టూడెంటుకి మధ్య ప్రేమకథ .. ఆసక్తిగా ఉంది కదూ? అపుడెపుడో విక్టరీ వెంకటేష్ - మీనా - అపర్ణ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సుందర కాండ అలాంటి కథాంశమే. ఆ చిత్రంలో వెంకటేష్ ఓ జూనియర్ కాలేజ్ లో తెలుగు లెక్చరర్. అతడికి అప్పటికే మీనా తో మ్యారేజ్ అయ్యిందని తెలిసినా అమాయకంగా అతడి ప్రేమలో పడుతుంది స్టూడెంట్ అపర్ణ. ఆ తర్వాత కథలో బోలెడన్ని ట్విస్టులు. ఇక అపర్ణ బతకదు. చావుకి టైమ్ దగ్గరకొచ్చేసింది అని తెలిసినప్పట్నుంచి తెగ ఏడుపే ఏడుపు. ఈ కథంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తోందంటే ...

ఇప్పుడు సేమ్ టు సేమ్ క్యారెక్టర్ లో మాస్ మహారాజ్ రవితేజ కనిపించబోతున్నాడు. అతడు తన కెరీర్ లోనే ఓ క్లాస్ రోల్ టేకప్ చేశాడు. దిల్ రాజు నిర్మాతగా అతడి ఆస్థాన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ దసరాకి హైదరాబాద్ లో ముహూర్తపు ఠెంకాయ కొట్టారు. ఈ చిత్రంలో రవితేజ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంటే మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కాలేజ్ స్టూడెంట్ గా ఆడిపాడబోతోంది. ఈ సోమవారం నుంచే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. మరో సుందర కాండను రిపీట్ చేయబోతున్నారని అనుకోవచ్చేమో!

,  ,  ,  ,