Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2016 19:18:39
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు ''బ్రహ్మోత్సవం'' సినిమా గురించి సమంత ఒక ట్వీటు డెలీట్ చేసిందని.. దాని గురించే అందరూ రచ్చరచ్చగా డిస్కస్ చేస్తున్నారు. అయితే అమ్మడు ఎప్పుడో వేసిన ట్వీటును ఇప్పుడు డెలీట్ చేయడం వలన ఏం ప్రయోజనం అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఈ డెలీషన్ కు కారణం మహేష్ బాబు ఫ్యాన్సే. గతంలో ఓసారి ఆమె 'రిగ్రెసివ్' అంటూ.. ఒక హీరోయిన్ అలా హీరో పాదాల దగ్గర పాకుతూ ఉండటం ఏంటని అడుగుతూ.. ఇన్ డైరెక్టుగా 1-నేనొక్కడినే పోస్టర్ పై ట్వీటు వేయడంతో.. అది రచ్చ రచ్చ య్యింది. ఫ్యాన్స్ ఆమెను ఫుట్ బాల్ అడుకున్నారు. అందుకే ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితిని ఎవాయిడ్ చేసుండొచ్చు స్యామ్.

ఆ మధ్యన బాలా త్రిపురమణి సాంగ్ నా ఫేవరేట్ అని సమంత ఒక ట్వీటేసింది. ఆ పాటలో సూపర్ స్టార్ లుక్ చూస్తే అదిరిపోతుందని.. సినిమా రిలీజయ్యాకే మీకే అర్దమవుతుంది అంటూ చెప్పుకొచ్చిందిలే. అయితే సమంత చాలా పాజిటివ్ గా ఆ ట్వీట్ వేసింది అప్పట్లో. మహేష్ లుక్ ఎంతో కత్తిలా ఉందని చెప్పడానికే తాపత్రాయపడింది. కాని సినిమా రిలీజ్ అయ్యాక.. ఆ పాటలో మహేష్ వేసిన స్టెప్పును దారుణంగా విమర్శించడం ఆనవాయితీగా మారింది. యాంట్ ఇన్ ది ప్యాంట్స్ స్టెప్ అంటూ కామెంట్లు పేలుతున్నాయి. ఇలా జరిగిన తరువాత సమంత ట్వీట్ చూస్తే.. కావాలనే ఆమె సెటైర్ వేసిందేమో అనే అనుమానం రాక మానదు.

ఒకవేళ అలాంటి అనుమానమే వస్తే.. మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్ లో సమంతకు ఊపిరాడనిస్తారా? అందుకే ట్వీట్ డిలీటెడ్!!

,  ,  ,  ,  ,