Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 12:19:54
facebook Twitter Googleplus
Photo

ఏదైనా ఫంక్షన్ లో చివరగా జైహింద్ అనడం పవన్ కళ్యాణ్ కు అలవాటు. అలా ఓసారి జైహింద్ చెప్పాక.. ఇక ఆ ప్లేస్ లో కనిపించకుండా స్పీడ్ గా వెళ్లిపోతాడు. కానీ సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో జైహింద్ అనేసి బయల్దేరిసిన పవర్ స్టార్ ని.. మ్యూజిక్ డైరెక్టర్ బుల్గానిన్ కారణంగా బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన బుల్గానిన్ గురించి మాట్లాడలేదనే విషయం గుర్తొచ్చి ఆగిపోయి మళ్లీ మైక్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ఇది ఆ కంపోజర్ ఎఫెక్ట్ కాదు.. 'బుల్గానిన్' అనే పేరు మాత్రమే పవన్ ఆగిపోవడానికి కారణం.

ఇంతకీ ఎవరీ బుల్గానిన్ అంటే.. కమ్యూనిస్ట్ లీడర్లలో ఒక పెద్దాయన. నికొలాయ్ అలెగ్జాండ్రోవిచ్ బుల్గానిన్ ఈయన పూర్తి పేరు. సోవియట్ యూనియన్ లో అనేక పదవుల్లో విధులు నిర్వహించిన ఈయన.. రెడ్ ఆర్మీతో పాటు స్టాలిన్ నాయకత్వంలో డిఫెన్స్ మినిస్టర్ గా కూడా పని చేశారు. అంతే కాదు.. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో స్టాలిన్ కు మొదటి డిప్యూటీ కూడా. 1955లో కురుస్చేవ్ తో కలిసి ఇండియాను విజిట్ చేసిన కమ్యూనిస్ట్ లీడర్ కూడా. అందుకే బుల్గానిన్ అనే పేరు గల వ్యక్తి కనిపించగానే ఆగిపోయిన పవన్ కళ్యాణ్.. 'బుల్గానిన్ అనే పేరు మా ఇంట్లో చిన్నప్పుడు నాన్నగారి దగ్గర ఎక్కువగా వినివాడిని. కమ్యూనిస్ట్ ల పేర్లు ఎక్కువగా వినిపించేవి.. మా నాన్నగారి ప్రభావం. బుల్గానిన్ అనే పేరు నాకు బాగా ఫెమిలియర్' అన్నాడు.

ఇందాక ప్లే చేసిన మెలోడీ మళ్లీ విందామని అనుకునేలోపు 30సెకన్లకే కట్ చేశారు. చాలా బాధగా అనిపించింది. చిత్ర సీమలో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నా. నాకు తెలిసిన కొద్ది అనుభవాన్ని బేస్ చేసుకుని.. ఇతను గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నా' అంటూ మరోసారి జైహింద్ చెప్పాడు పవన్ కళ్యాణ్.

,  ,  ,  ,