Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2016 14:10:37
facebook Twitter Googleplus
Photo

కొండ ఒకరికి తలొంచదు.. తుఫాన్ ఎవరికీ తలొంచి ఎరగదు.. నాకిష్టమైన స్నేహితుడు.. నా సునామీ.. నా ఉప్పెన.. నేను దాచుకున్న నా సైన్యం.. నేను శత్రుమీద చేసే యుద్ధం.. నేను ఎక్కుపెట్టిన బాణం.. నా పిడికిట్లో వజ్రాయుధం.. నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు.. లక్షల మంది గుండెలు తడపడానికి వచ్చిన ఒక చిన్నపు వర్షపు చినుకు.. స్నేహ రుతు పవనం..?? అంటూ తన మిత్రుడు పవన్ కళ్యాణ్ గురించి వర్ణించడానికి తన పాండిత్యాన్ని బాగానే వాడాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈ మాటలన్నీ ఓకే కానీ.. చివర్లో పవన్ కు మైకు అందించే ముందు.. ??వింటారా.. వెనకాలే వస్తారా.. తోడుగా ఉందాం వస్తారా?? అంటూ త్రివిక్రమ్ అన్న కొసమెరుపులే అందరినీ ఆలోచనలో పడేశాయి. అవి ఆ సందర్భానికి అనుగుణంగా చేసిన వ్యాఖ్యల్లాగా లేవు. మన జన సేనాని త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. మరి మీరంతా అతడి మాటల్ని వింటారా.. అతడి వెనకాల వస్తారా.. నాతో పాటు తోడుగా ఉంటారా.. అని అడిగినట్లుగా ఉంది త్రివిక్రమ్ మాటల తీరు చూస్తుంటే.

జనసేన పార్టీ పెట్టినపుడు తొలి ప్రసంగమే కాక.. గత ఎన్నికల ముందు పవన్ చేసిన అనేక ప్రసంగాల్లో త్రివిక్రమ్ పాత్ర ఉందని చాలామంది నమ్మకం. దారంతా గతుకులు.. అంటూ తన రాజకీయ రంగ ప్రవేశాన్ని పోలుస్తూ పవన్ అప్పుడు చెప్పిన మాటల్లో త్రివిక్రమ్ ముద్ర స్పష్టంగా కనిపించింది. కేవలం ప్రసంగాలు రాసివ్వడమే కాదు.. ఇప్పటిదాకా పవన్ రాజకీయ ప్రస్థానంలో త్రివిక్రమ్ అనేక రకాలుగా సాయపడ్డాడని కూడా అంటారు. పవన్ తెర వెనుక ఉన్నపుడే అంత చేసినవాడు.. ఇక నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నికల బరిలోకి దిగాడంటే ఇంకెంత కీలక పాత్ర పోషిస్తాడో అంచనా వేయొచ్చు. నిన్నటి ?అ..ఆ? ఆడియో వేడుకలో త్రివిక్రమ్ వ్యాఖ్యలు దానికో సూచిక అనుకోవచ్చు.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,