Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2017 09:58:57
facebook Twitter Googleplus
Photo

మెగా హీరో సాయిధరం తేజ్ నటించిన మూవీ విన్నర్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 24న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను ఫిబ్రవరి9నే విడుదల చేస్తామని చెప్పిన యూనిట్.. చివరి నిమిషంలో వాయిదా వేసింది.

సినిమా రిలీజ్ కు కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉండగా.. ట్రైలర్ ను రిలీజ్ చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగింది. రిలీజ్ పై కూడా కొన్ని సందేహాలు తలెత్తాయి. అయితే.. విన్నర్ ట్రైలర్ వాయిదాకు గల కారణం ఇప్పుడు తెలియవచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు జంతువుల సీన్స్ అడ్డుపడ్డాయట. మన దేశంలో ఉన్న రూల్స్ ప్రకారం జంతువులను చూపిస్తే.. యానిమల్ వెల్ఫేర్ విభాగం నుంచి అనుమతులు తప్పనిసరి. వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందితేనే.. ప్రదర్శించడానికి వీలవుతుంది.

ట్రైలర్ కు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఆఖరి నిమిషం వరకూ ఎన్ఓసీ అందకపోవడంతో.. ట్రైలర్ ను వాయిదా వేసుకుందిట విన్నర్ టీం. ఇప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి ఆ సర్టిఫికేట్ చేతికి అందాకే.. ట్రైలర్ కు కొత్త రిలీజ్ చెప్పనున్నారట తేజు అండ్ టీం.

,  ,  ,  ,  ,  ,  ,