Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2017 15:45:00
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోయిన్ నయనతారకు సౌత్ అంతా డిమాండ్ ఉంటుంది. తమిళ్.. మలయాళం.. తెలుగు భాషల్లో ఈ భామకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే.. కోలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడు ఓ రేంజ్ లో కుమ్మేస్తోంది. గత రెండేళ్లుగా అయితే.. నయన్ అంటే పడి చచ్చిపోతున్నారు తమిళ జనాలు.

నయన్ బొమ్మ కనిపిస్తే చాలు.. ఆ మూవీని బ్లాక్ బస్టర్ చేసేస్తున్నారు. ఇది సినిమాల లెక్కైతే.. ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ భామ క్రేజ్ ఎక్కువగానే ఉంది. 'మోస్ట్ డిజైరబుల్ విమన్ ఆఫ్ చెన్నై'గా కిరీటం నిలబెట్టుకుంది నయన్. గతేడాది కూడా ఈ జాబితాలో నయనతారకే అగ్రస్థానం కట్టబెట్టిన తమిళ జనాలు.. వరుసగా రెండో ఏడాది కూడా ఆమెకే ఓటేయడం విశేషం.

ఇలా వరుసగా తనను అగ్రస్థానంలో కూర్చోబెట్టడంపై నయన్ స్పందించింది. 'వరుసగా రెండేళ్లపాటు టాప్ ప్లేస్ లో ఉన్నా. నిజంగా చెప్పాలంటే.. నమ్మలేకపోతున్నా. ఈ టైంలో ఆడియన్స్ నన్ను ఎంతగానో అభిమానించారు. ఇప్పుడున్న స్థానం కంటే మరింత ఉన్నతమైన ప్లేస్ అందుకోవాలనే బాధ్యతను నాపై పెట్టారు ప్రేక్షకులు' అని చెప్పింది నయన్.

,  ,  ,  ,  ,  ,