Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2017 10:57:07
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ మన్మథుడని పేరుంది. తన ఇద్దరు కొడుకులు హీరోలయినా ఇప్పటికీ తరగని ఛార్మింగ్ తో కనిపిస్తుండంటం ఆయన స్పెషాలిటీ. చాలా సినిమాల్లో ఒకే లుక్ తో కనిపించినా నాగ్ అట్రాక్షన్ ఏ మాత్రం తగ్గలేదు. అలాంటిది తాజాగా నాగార్జున ఎవరూ ఊహించని రీతిలో ఇవ్వాళ మీడియా ముందుకొచ్చారు. మీసం మొత్తం తీసేసి క్లీన్ షేవ్ తో కనిపించారు. ఇదేమని అడిగిన వారందరికీ సరదాగా ట్రై చేశానంటూ సర్ది చెప్పేశారు.

నాగార్జున ఇంతవరకు ఎప్పుడూ ఇలా మీసం తీసేసి కనిపించలేదు. ఇంతకుముందు బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో నాగార్జున నటించారు. సాధారణంగా బాలీవుడ్ హీరోలంతా ఎప్పుడో ఓసారి కానీ మీసాలతో నటించరు. కానీ హిందీ సినిమాల్లో కూడా నాగార్జున మీసంతోనే కనిపించారు. అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రం చేసినప్పుడూ మీసం తీయలేదు. నాగార్జున స్టయిలిస్ట్ లో ఒకరి సూచన ప్రకారం మీసంతో కొత్తలుక్ కోసం ప్రయత్నించారని.. కానీ చివరకు ఆ స్టయిలిస్ట్ ఆయనను తీవ్రంగా నిరాశ పరిచారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఇన్నాళ్లూ ఎంతో ఇష్టంగా పెంచుకున్న మీసం పూర్తిగా తీసేయడానికే నాగ్ ఇష్టపడ్డారంటే ఆ స్టయిలిస్ట్ నాగ్ ను ఎంతగా డిజప్పాయింట్ చేశారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.

స్టయిలిస్ట్ తప్పిదం వల్ల నాగ్ తన మీసం తీసేసినా అభిమానులకు ఇలా కనిపించడం ఇదే ఫస్ట్ టైం. అభిమానుల్లో కొంతమంది రొటీన్ కు భిన్నంగా ఈ లుక్ కూడా బాగానే ఉందంటున్నారు.

,  ,  ,  ,  ,