Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2017 12:19:40
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయి ధరం తేజ్ శైలి విభిన్నం. మిగిలిన హీరోలు అంతా మెగాస్టార్ ని.. పవర్ స్టార్ ని ఇమిటేట్ చేసేందుకు వెనకాడితే.. తేజు మాత్రం నిర్మొహమాటంగా వారిని దించేస్తాడు. యాక్టింగ్ నుంచి.. డ్యాన్స్ ల వరకు.. ఫైట్స్ నుంచి పోజుల వరకూ ప్రతీ విషయంలో వారిని గుర్తు చేసేందుకు ఏ మాత్రం వెనకాడడు. ఇప్పుడీ హీరో జవాన్ అంటూ దేశభక్తి యాంగిల్ లో ఓ కమర్షియల్ మూవీ చేస్తున్నాడు.

బహుశా కొన్ని నెలలుగా దేశభక్తి గురించిన సన్నివేశాలలో నటించడం కారణంగా అనుకుంటా.. రీసెంట్ గా ఇస్రో సక్సెస్ ఇతడిని బాగా ఇన్ స్పైర్ చేసేసింది. ఇస్రో ఘనతను సోషల్ మీడియాలో పొగడకుండా ఉండలేకపోయాడు. ఆ ప్రశంసలు కూడా అలా ఇలా కాదు.. సినిమాలతో పోల్చి మరీ.. ఇస్రో సాధించిన విజయమే గొప్ప అని చెప్పడం విశేషం. ఒక సినిమా 50 రోజులు ఆడడం.. ఒ క్రికెట్ ప్లేయర్ 50 రన్స్ చేయడం సాధారణంగా జరిగేదే. అయితే వాటి కంటే మన అంతరిక్ష సంస్థ ఇస్రో సక్సెస్ ఫుల్ 50 శాటిలైట్స్ ను లాంఛ్ చేయడమే చాలా గొప్ప విషయం అంటూ ట్వీట్ పెట్టాడు తేజు.

ఇక ఈ యంగ్ హీరో సినిమాల విషయానికి వస్తే.. వరుస సక్సెస్ ల తర్వాత తిక్క.. విన్నర్ తో ఎదురు బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ మూవీలో నటిస్తున్నాడు సాయి ధరం తేజ్.

,  ,  ,  ,  ,