Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jun-2016 12:14:51
facebook Twitter Googleplus
Photo

క్లీన్ కామెడీగా సెన్సార్ నుంచి యూ సర్టిఫికేట్ తెచ్చుకుని.. హ్యూజ్ సక్సెస్ సాధించింది అ..ఆ. ఇప్పుడీ సినిమాలో కట్స్ విధించాల్సి వచ్చింది. అది కూడా ఓ కులాన్ని అవమానించారనే కంప్లెయింట్ కారణంగా.. ఈ కట్స్ విధించాల్సి రావడం విశేషం.

అ..ఆ.. మూవీలో కమెడియన్ షకలక శంకర్ ఓ దొంగ పాత్ర పోషిస్తాడు. ఈ రోల్ పేరు ప్రతాప్ రెడ్డి. అలాగే ఇతని తండ్రి రోల్ కనిపించకపోయినా.. డైలాగ్స్ లో మాత్రం ఫాదర్ పేరు బాల్ రెడ్డి ఫ్రం బంజారా హిల్స్ అని చెప్తారు. ఇప్పుడీ రెండు పేర్లకు సంబంధించి.. రెడ్డి అనే పదాలను మ్యూట్ చేయాలని ఆదేశించింది సెన్సార్ బోర్డ్. సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే రెడ్డి జన సంఘం ఈ పేర్లపై ఫిర్యాదు చేసింది. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా జోక్యం చేసుకోవడంతో.. ఈ పేర్ల విషయంలో రెడ్డి అనే పదాన్ని మ్యూట్ చేశారు మేకర్స్.

'పేర్ల విషయంలో అభ్యంతరాలు వచ్చినా.. అప్పటికే డిజిటల్ ప్రింట్స్ వెళ్లిపోయాయి. ఇవి వారం పాటు లాక్ అయిపోతాయి. వీటిని ఆ సమయంలో ఏం చేయలేం. మిగతా థియేటర్స్ కు మార్చిన వెర్షన్ పంపాం. ఇప్పుడు అన్ని థియేటర్లలోనూ పేర్లను మ్యూట్ చేసిన మేరకే టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే.. మేం ఆ కమ్యూనిటీని అవమానించేలా ఎటువంటి సీన్స్ పిక్చరైజ్ చేయలేదు' అంటున్నారు

,  ,  ,  ,  ,  ,  ,