Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 12:26:39
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా పట్టాలెక్కేసింది. అప్పుడే ఈ మూవీకి రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలైపోయింది. స్టార్టింగ్ నుంచి ఈ మూవీ విషయంలో.. 2017 సమ్మర్ కి రిలీజ్ అనే మాట తప్ప.. మురుగదాస్ అండ్ టీమ్ నుంచి వేరే మాట వినిపించడం లేదు. కనీసం మహేష్ కేరక్టర్ ఏంటో చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు.

మురుగదాస్ తో మహేష్ చేస్తున్న బైలింగ్యువల్ లో.. మహేష్ పాత్ర 'రా' ఆఫీసర్ అని ఒకసారి.. న్యాయవ్యవస్థతో పోరాడే లాయర్ అని ఓసారి.. చాలానే రూమర్లు షికార్లు చేశాయి. కానీ ఇవన్నీ ఒట్టి పుకార్లేనట. ఈ సినిమాలో సూపర్ స్టార్ చేస్తున్నది సూపర్ కాప్ రోల్ అని లేటెస్ట్ టాక్. ఈసారి అంచనాలు.. పుకార్లు కాదు.. మురుగ టీమ్ నుంచే లీకులు వచ్చేస్తున్నాయి. అసలు కేరక్టర్ కంటే కాన్సెప్ట్ పక్కకు వెళ్లిపోతుండడంతో.. ఎలర్ట్ అయిన యూనిట్.. క్లారిటీ ఇచ్చేందుకు ట్రై చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇంతకంటే వేరే ఏం చెప్పలేం కానీ.. వచ్చే సమ్మర్ మాత్రం రిలీజ్ ఖాయమని మళ్లీ చెబుతున్నారు.

మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ తొలిసారి కావడంతో పాటు ఈ మూవీలో చాలానే స్పెషాలిటీస్ ఉన్నాయి. మహేష్-రకుల్ లు మొదటిసారిగా జంటగా నటిస్తున్నారు. డైరెక్టర్ ఎస్ జే సూర్య.. విలన్ గా తొలిసారిగా తెలుగులో నటిస్తున్నాడు. మహేష్ చైల్డ్ యాక్టర్ గా ఉన్నపుడు(1988లో బజారురౌడీ) నదియాతో నటించగా.. మళ్లీ ఇన్నేళ్లకి వీరిద్దరూ ఓ సినిమాలో చేస్తున్నారు.

,  ,  ,  ,  ,