మెగాస్టార్ పక్కన ఓ ఐటెం సాంగ్ లో రెజీనా డ్యాన్స్ చేయనుందనే న్యూస్ మాత్రం బాగా ఇంట్రెస్ట్ కలిగించింది. మరి రెజీనా లాంటి యంగ్ హీరోయిన్ మెగాస్టార్ పక్కన చిందులేస్తుంటే చూసేందుకు బాగానే ఉంటుంది కానీ.. అసలు సంగతి ఆమెనే అడిగేస్తే చెబుతుంది కదా.?చిరంజీవి 150వ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్నానంటూ చాలానే రూమర్స్ వచ్చాయి. అసలు విషయం ఏంటంటే.. ఈ రోల్ కోసం ఇప్పటివరకూ నన్ను ఎవరూ సంప్రదించనే లేదు? అంటూ క్లారిటీ ఇచ్చిన కుర్ర భామ.. మరి ఆఫర్ వస్తే అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇచ్చింది. ?నో.. నన్ను నేను ఐటెం సాంగ్స్ లో చూడాలని అనుకోవడం లేదు. నాకు డ్యాన్సులు అంటే ఇష్టమే కానీ.. నాకు ఐటెం గాళ్ గా మారాలనే కోరిక మాత్రం లేదు? అంటూ చెప్పుకొచ్చింది రెజీనా.
Regina, Not, Intrested, Dance, Chiru, Matter, Tollywood,