Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 11:21:13
facebook Twitter Googleplus
Photo

జై లవ కుశ.. ఎల్లుండే థియేటర్లలోకి వచ్చేస్తోంది. రేపు రాత్రి నుంచే పలు ఏరియాల్లో ప్రీమియర్స్ టెలికాస్ట్ కానున్నాయి. మూవీ రిలీజ్ కు ఇంకా 48 గంటల సమయం కూడా లేకపోవడంతో.. నందమూరి అభిమానుల హంగామా ఇప్పటికే పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. పైగా ఎన్నడూ లేని విధంగా.. ఎన్టీఆర్ కూడా ప్రచార హంగామా తెగ చేసేస్తున్నాడు. ఈ సినిమాలో జై పాత్ర ప్రభావం తన రియల్ లైఫ్ లో కూడా కనిపించిందని తనే చెప్పేస్తున్నాడు.

పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసే సామర్ధ్యం ఉన్న ఎన్టీఆర్.. ఇలాంటి మాటలు చెప్పడం ఆశ్చర్యకరమే. అయితే.. ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించడం.. వాటిలో జై క్యారెక్టర్ ఎంతో క్లిష్టతరమైనది కావడంతో.. ఆ ప్రభావం నుంచి బయటకు వచ్చేందుకు సమయం పట్టిందని చెప్పిన జూనియర్.. తనకు బయటకు తీసుకొచ్చిన క్రెడిట్ అంతా బిగ్ బాస్ షోకి ఇచ్చేశాడు. ప్రధానంగా ఈ క్యారెక్టర్ తీరుతెన్నులు విపరీతంగా నచ్చడం.. బాబీ ఇచ్చిన నెరేషన్ కు ముగ్ధుడైపోవడంతోనే.. జై లవకుశ ప్రాజెక్టు చేపట్టినట్లు చెప్పాడు జూనియర్.

సోదరులకు.. కుటుంబాలకు జై లవకుశ చక్కని గిఫ్ట్ అని ఎన్టీఆర్ అంటున్నాడు. ఇలాంటి మూవీని తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో చేయడం మరింతగా నచ్చేసిందని చెప్పాడు.

,  ,  ,  ,