Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 10:58:52
facebook Twitter Googleplus
Photo

టాప్ హీరోయిన్ అనిపించుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తుంది రెజీనా కసాండ్రా. కానీ టాప్ అన్న ట్యాగ్ మాత్రం దక్కించుకోలేకపోతుంది. తనకన్నా లేట్ గా కెరీర్ స్టార్ట్ చేసినవాళ్లు కూడా దూసుకుపోతుంటే రెజీనా మాత్రం ఇంకా చిన్న సినిమాలకి పెద్ద ఛాయిస్ గానే ఉంది తప్ప.. బిగ్ మూవీస్ లో సెకండ్ హీరోయిన్ ఆఫర్ కూడా పట్టలేకపోతుంది. ఇలా అయితే లాభం లేదనుకుందో ఏమో కానీ తనలోని బోల్డ్ యాంగిల్ చూపించేస్తుంది.

అందం ఉంది.. అభినయం ఉంది.. కానీ అదృష్టమే లేదు. అల్రెడీ గ్లామర్ ఒలకబోస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకే ఇప్పుడు తనలోని వర్షన్ టూని బయటికి తీసింది. ఇన్నాళ్లూ ఒక లెక్క ఇక మీదట మరో లెక్క అన్నట్టు చెలరేగిపోతుంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది కదా ఆ ప్రభావం పడినట్టు ఉంది ఏకంగా బెడ్ టైమ్ ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. అంతేనా అడగడమే ఆలస్యమన్నట్టు ఏ ప్రశ్న వేసినా ఘాటుగా సమాధానాలిచ్చేస్తోంది. సెక్సీ వర్డ్ ని యాడ్ చేసి కొన్ని క్వశ్చన్స్ లిస్టౌట్ చేసి అడిగితే అంతకన్నా స్మార్ట్ గా ఆన్సర్స్ ఇచ్చింది ఈ చెన్నై చిన్నది.

కాన్ఫిడెన్స్ గా ఉండటమే సెక్సీనెస్.. శారీలో ఉన్నంత సెక్సీనెస్ ఇంకెక్కడా లేదు.. వర్కౌట్స్ తర్వాత సెక్సీగా ఫీలవుతా అంటూ చాలా కబుర్లే చెప్పింది. అంతేకాదు డిన్నర్ డేట్ కెళ్తే బ్లాక్ డ్రస్.. బీచ్ డేట్ కెళితే షార్ట్స్ అండ్ టీషర్ట్ వేసుకెళ్తా అని సెలవిచ్చింది. జెన్నిఫర్ లోఫెజ్ వేసుకొన్న న్యూడ్ డ్రెస్ వేసుకోవాలని ఉంది కానీ అన్ని గట్స్ లేవట. యాజ్ యుజువల్ గా సీన్ డిమాండ్ చేస్తే బికినీ వేయడానికి నో అబ్జక్షన్స్.. ఆత్మవిశ్వాసంతో కనిపించే మగాళ్లంటే ఇష్టం. అలాగని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నవాళ్లని చూస్తే మండుదట. పనిలో పనిగా మహేష్ బాబు.. రామ్ చరణ్ సెక్సీ యాక్టర్లంటూ ప్రసన్నం చేసుకొంది. ఇదంతా చూసి రెజీనా ఇప్పుడు మారిన మనిషి.. అప్ గ్రేడ్ వర్షన్ మాములుగా లేదుగా అనుకుంటున్నారు. మరి పాప అయితే అన్ని ఓపెన్ గా చెప్పేసింది. పాపం ఇప్పుడైనా ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వండయ్యా.

,  ,  ,  ,