Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Sep-2015 12:22:42
facebook Twitter Googleplus
Photo

క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రెజీనా. ఒక దానివెంట మరొకటి వరుసగా విజయాలు దక్కుతుండటంతో ఆమెకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే గోపీచంద్ సినిమాలో నటిస్తున్న రెజీనా తాజాగా భల్లాలదేవ రానా సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. బయటికి చెప్పడం లేదు కానీ... ఇంకో రెండు మూడు క్రేజీ ఆఫర్లు కూడా ఆమె చేతిలో ఉన్నాయని సమాచారం. ఇక స్టార్ హీరోయిన్ అని పిలిపించుకొనే సమయం దగ్గరకొచ్చిందన్నమాట.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో రెజీనా ఆనందానికి అవధుల్లేవు. సక్సెస్ వచ్చిన ఆనందమే కాదు... ఆ సినిమాలో కనిపించిన విధానం గురించి కూడా రెజీనాకి కాంప్లిమెంట్లు వచ్చాయి. క్రిటిక్స్ కూడా రెజీనా నటననీ ఆమె అందాన్ని పొగిడేశారు. అందుకే రెజీనాలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇంకో హిట్టు పడితే మాత్రం స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే అని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి.

ఇక రానాతో సినిమా విషయానికొస్తే... కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడు. రానాకి ప్రేమ్ రక్షిత్ చెప్పిన కథ నచ్చడంతో సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఆ సినిమాని నిర్మించేందుకు ఏర్పాట్లు చేసిపెట్టాడు. తాజాగా అందులో కథానాయికగా రెజీనాని ఎంపిక చేసుకొన్నట్టు తెలిసింది. రానాకి తగ్గ హైట్ తో ఉంటుంది కాబట్టి రెజీనానే పర్ఫెక్ట్ మ్యాచ్ అని డిసైడయ్యారట. అదొక ప్రేమకథగా తెరకెక్కుతున్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలున్నాయి.

,  ,  ,