Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2015 11:49:21
facebook Twitter Googleplus
Photo

నాగశౌర్య హీరోగా రూపొందిన ?జాదూగాడు? అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ సోనారిక బదోరియా. అంతకుముందే టీవీ సీరియల్స్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సోనారిక తన మొదటి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా సోనారికకు మాత్రం ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు ?సరదా?, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా, సందీప్ కిషన్ ?ఒక్క అమ్మాయి తప్ప? సినిమాలతో బిజీ అయిన ఈ హీరోయిన్, మంచు విష్ణుతోనే మరోసారి కలిసి నటించనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.
మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన హీరోయిన్‌గా అమైరా దస్తూర్‌ను ఎంపిక చేశారు. అయితే ఇతర సినిమాలతో బిజీగా ఉన్న అమైరా ఈ సినిమా చేయలేకపోవడంతో తాజాగా ఆమె స్థానంలో సోనారికను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమా ఓ పంజాబీ సినిమాకు రీమేక్.

,  ,  ,  ,