Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2016 11:34:11
facebook Twitter Googleplus
Photo

గత రెండు మూడు నెలల్లోనే రష్మీ గౌతమ్.. రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదట అంతం మూవీతో రాగా.. గత వారం చారుశీలతో మన ముందుకొచ్చింది. కానీ ఇవేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. రష్మీ గౌతమ్ వుంటే చాలా బిజినెస్ కు డోకా వుండదని నిర్మాతలు భావించి.. ఆమెతో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారో. ఓ వైపు బుల్లితెరపై జబర్దస్థ్ లాంటి సెన్సేషనల్ కామెడీ షోతో బాగా పాపుల్ అయిన ఈ హాట్ యాంకర్ ఇప్పుడు ?తను వచ్చెనంట? మూవీతో మన ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన లోగో... పాటలను లాంఛ్ చేశారు. ఇందులో రష్మీ చేసిన సోలో సాంగ్ కుర్రకారును వెర్రెత్తించడం ఖాయం అంటున్నారు.

?బాహుబలి?లో ఓ పాత్ర పోషించిన తేజ.. ఇందులో లీడ్ రోల్ పోషించారు. అతని సరసన ధన్య బాలకృష్ణన్ రష్మీ గౌతమ్ నటించారు. జాంబి కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మీ గౌతమ్.. తన గత చిత్రాలు అంతం.. చారుశీల రెండింటి ప్రమోషన్లలోనూ పాల్గొనలేదు. అయితే ఆశ్చర్యకరంగా... తను వచ్చెనంట మూవీ ప్రమోషన్లో మాత్రం ఎంతో చాలాకీగా పాల్గొంది. అందుకు కారణం... ఈసినిమా కంటెంట్ పై ఆమెకున్న కాన్ఫిడెంటేనట. మొదటి రెండు సినిమాల్లోనూ.. విషయం లేకపోవడం ఓ ఎత్తైతే... కేవలం తన గ్లామర్ తోనే ఆ సినిమాల బిజినెస్ చేసేశారట. అయితే తను వచ్చెనంటలో మాత్రం కంటెంట్ తో పాటు..తన గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని రష్మీగౌతమ్ భావిస్తోందట. చూడాలి.. రామ్ ?హైపర్?కు పోటీగా విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సీఫీస్ వద్ద ఏమాత్రం నిలబడుతుందో.

,  ,  ,  ,  ,