Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2016 16:13:46
facebook Twitter Googleplus
Photo

మనిషిలోనే కాదు... మాటలోనూ అందమే అని చెప్పకనే చెప్పింది శ్రుతిహాసన్. నటనలోనే కాకుండా మాటల్లోనూ తన ప్రావీణ్యాన్ని చూపిస్తానని కూడా ఆమె నిరూపిస్తోంది. మామూలుగా హీరోయిన్లు డిమాండ్ లో ఉన్నప్పుడే పారితోషికాలు పెంచేస్తుంటారు. ఇంతిస్తేనే చేస్తాం లేదంటే లేదు అని తెగేసి చెబుతుంటారు. గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతి కూడా అలాగే చెప్పిందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటుంటాయి.

అయితే ఆమె మాత్రం డబ్బుకి ప్రాధాన్యమే ఇవ్వనని చెబుతోంది. క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం తప్పేమీ కాదంటూనే నేను మాత్రం అలా ఆలోచించనని తప్పించుకొంటోంది. డిమాండ్ గురించి పారితోషికం గురించి ఆమె మాట్లాడుతూ ``క్రేజ్ ని కోట్లుగా మార్చుకోవడం కంటే వాటిని మంచి అవకాశాలుగా తీర్చిదిద్దుకోవడమే నాకు ఇష్టం. నాకు క్రేజ్ ఉందంటే ఎక్కువ కథలు వినే అవకాశం లభిస్తుంది. ఎక్కువ కథలు నా దగ్గరికొస్తే వైవిధ్యమైన పాత్రలు లభిస్తాయి. దాంతో నటిగా నేను మరింత ముందుకెళ్లొచ్చు. అదే డబ్బు మాత్రమే కావాలనుకొంటే నా దగ్గరికి దమ్మున్న కథలు రాకపోవచ్చు. అందుకే నేను డబ్బు కంటే అవకాశాలకీ అవకాశాల్ని సద్వినియోగం చేసుఓవడానికీ ప్రాధాన్యమిస్తా`` అని సెలవిచ్చిందామె. శ్రుతి ప్రస్తుతం తెలుగులో మజ్నులో నటిస్తోంది. తమిళం - హిందీ భాషల్లోనూ కొన్ని చిత్రాల్ని చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

,  ,  ,