Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 13:51:09
facebook Twitter Googleplus
Photo

స్టామీనా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్ కు ఫుల్ ఖుషీ అయిపోయిన చిరు వెంటనే తన 151వ చిత్రం సరై నరసింహారెడ్డిని మొదలుపెట్టేశాడు. ఈ చిత్రాన్ని కూడా తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు చిరంజీవి. కొణిదేల ఆర్ట్స్ పతాకం పై రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు నయతార - ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్లు - బిగ్ బి అమితాబ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇంతవరుకు బాగానే ఉంది ఇటీవలే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం రామ్ చరణ్ బాగానే ఖర్చుపెడుతున్నట్లుగా తెలిసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించేందుకు చెర్రీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సైరా నరసింహా రెడ్డి సెట్స్ నుంచి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వస్తోంది. రాయలసీమకి చెందిన స్వాతంత్ర సమరయోధుడు సరైనరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి వాడబోతున్న చెప్పులు - క్యాస్ట్యూమ్స్ కోసం భారీగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి ఇద్దురు డిజైనర్లుని రప్పించి ఈ సినిమాలో ఉండే సన్నివేశాలకు తగ్గట్లుగా కాస్ట్యూమ్స్ వాటికి సరిపడా చెప్పులు రెడీ చెయిస్తున్నారట. ఇలా డిజైన్ చేయించనందుకు ఆ బాలీవుడ్ డిజైనర్లు దాదాపు అయిదుకోట్ల రూపాయులు ఛార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో కేవలం చెప్పులు - బట్టలు కోసమే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనే ఊహాగానాలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో బలంగా వీస్తున్నాయి.

,  ,  ,  ,