Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2017 11:49:04
facebook Twitter Googleplus
Photo

సెలబ్రెటీలెవరైనా విడాకులు తీసుకుంటే భర్త భార్యకిచ్చే భరణం గురించి పెద్ద చర్చే నడుస్తుంటుంది. పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నాక అనంతరం వారి విషయంలోనూ ీ డిస్కషన్ నడిచింది. పవన్ నుంచి రేణు భారీ మొత్తంలో డబ్బు.. ఆస్తి తీసకుందని.. పవన్ తన విలువైన ఆస్తులు అమ్మి భరణం ఇచ్చాడని అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది. ఐతే ఇదంతా అబద్ధమే అంటోంది రేణు దేశాయ్. పవన్ నుంచి ఒక్క ఇల్లు తప్ప ఇంకేమీ తీసుకోలేదని ఆమె స్పష్టం చేసింది. అది కూడా పిల్లల కోసమే తీసుకున్నట్లు ఆమె చెప్పింది.

‘‘నేను పవన్ నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు చాలా ప్రచారాలే నడిచాయి. నాకు బాగా క్లోజ్ అయిన మా బంధువు ఒకాయన ఫారిన్ నుంచి ఫోన్ చేసి నువ్వు ఇలా చేస్తావనుకోలేదు.. ఇంత డబ్బు మనిషివి అనుకోలేదు అన్నాడు. నేను షాకయ్యాను. ఆయనకు అసలు విషయం వివరించాను. నిజానికి నేను కళ్యాణ్ గారి మెయింటైనెన్స్ కూడా అడగలేదు. ఐతే పిల్లలు నాతో ఉన్నారు కాబట్టి.. మెయింటైనెన్స్ అడగట్లేదు కాబట్టి.. కనీసం ఇల్లయినా తీసుకోమన్నారు. పిల్లల కోసమే ఆ ఇల్లు కూడా తీసుకున్నా. దాన్ని అమ్మేసి ఆ డబ్బుల్ని వేరే చోట ఇన్వెస్ట్ చేశాను. ఆ డబ్బులు పిల్లల చదువుల కోసమే ఉపయోగిస్తా. నేను 16వ ఏట నుంచే డబ్బులు సంపాదిస్తున్నా. సినీ రంగంలో కూడా బాగానే ఆర్జించాను. ఆ డబ్బులతోనే నా పిల్లల బాగోగులు చూస్తున్నా.

,  ,  ,  ,