Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2016 12:12:05
facebook Twitter Googleplus
Photo

బుల్లితెర ఫైనే కాదు వెండి తెర ఫై కూడా అభిమానులను సొంతం చేసుకుంది యాంకర్ & కామ్ హీరోయిన్ రేష్మి. జబర్దస్త్ ప్రోగ్రాం తో బాగా పాపులర్ అయిన ఈ హాట్ భామ , గుంటూరు టాకీస్ చిత్రం తో ఇంకాస్త పేరు తెచ్చుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మాదిరి పాపులార్టీ ఉన్నప్పుడే నాల్గు డబ్బులు వెనుకేసుకోవాలనే ధోరణితో రష్మీ ?బి? గ్రేడ్ సినిమాలు చేస్తూ పోతుంది.

ఇటీవల రేష్మి అంటే పడిచచ్చే ఓ అభిమాని ఆమెకు ఓ ఉచిత సలహా ఇచ్చాడు.. ?బీ గ్రేడ్ సినిమాల్లో నటించేబదులు మంచి స్టోరీలు ఎంచుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది? కదా అంటూ ఓ ఉచిత సలహా పారేసాడు. చాలాసార్లు ఇలాంటి సలహాలు విని విని విసుగెత్తిపోయిన రష్మీ, ఈసారి ఆ అభిమానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ?తప్పకుండా.. నువ్వు సినిమా ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నావో చెప్పు? అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఈ అన్సార్ చూసి సదరు అభిమాని మరో ప్రశ్న వేయలేదు.

కొంతమంది ఈమె ఇచ్చిన అన్సార్ ని తప్పుపడితే , మరికొంతమంది మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నారు..రష్మీ అన్నమాటలో తప్పుమేముంది..ఆమెకు అలాంటి కథలే వస్తున్నాయి కాబట్టి అలాంటి పాత్రలే చేస్తుంది..అంతేకాని ఓ అరుంధతి పాత్ర వస్తే ఆమెందుకు చేయదంటూ మరికొంతమంది కామెంట్స్ వేస్తున్నారు. ఏది ఏమైనా రేష్మి అన్సార్ మాత్రం ఇటు దర్శకులకు , అటు ఫ్యాన్స్ మంచి జవాబు అయ్యింది.

,  ,  ,  ,  ,  ,