Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Dec-2017 10:55:21
facebook Twitter Googleplus
Photo

ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేసే ఈ యంగ్ హీరో.. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకూ రెండే విడుదల చేశాడు. అయితే.. ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసేస్తున్న రాజ్ తరుణ్.. సంక్రాంతి రేస్ లో పోటీ పడేందుకు సిద్ధం అయిపోయాడు.

కొత్త దర్శకురాలు సంజనా రెడ్డి రూపొందిస్తున్న రాజుగాడు మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరో.. అదే వరుసలో రాజుగాడు చిత్రాన్ని కూడా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా.. ఇంకా 2 పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. వీటిని థాయ్ ల్యాండ్ చిత్రీకరించేందుకు యూనిట్ రెడీ అయింది. ఈ నెల 20న బయలుదేరి థాయ్ వెళ్లబోతున్నట్లు డైరెక్టర్ సంజనా రెడ్డి తెలిపారు. రొమాంటి కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీలో అమైరా దస్తూర్ తో కలిసి నటిస్తున్నాడు రాజ్ తరణ్.

తనకు మొదటి సినిమా అయినా.. యూనిట్ నుంచి వచ్చిన సపోర్ట్ చాలా సంతోషాన్ని ఇచ్చిందని సంజనా రెడ్డి చెబుతున్నారు. సీనియర్ నటులు అయినా సరే.. తనకు కావాల్సినట్లుగా అవుట్ పుట్ ఇచ్చారని.. మూవీ సూపర్బ్ గా వచ్చిందని ఆమె అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,