మంచు మనోజ్ హీరోగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న చిత్రానికి 'ఎటాక్' అనే టైటిల్ నిర్ణయించారు. ఇప్పటి వరకు దీనికి 'గొలుసు' అనే టైటిల్ ప్రచారంలో వుంది. అయితే, 'ఎటాక్' బాగా సూటవుతుందన్న ఉద్దేశంతో దీనిని ఖరారు చేశారు. ఇక భారీ ఎత్తున నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం వర్మ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. హైదరాబాదు పాతబస్తీకి చెందిన పురానాపూల్ బ్రిడ్జిపై 1000 మంది పాల్గొనే యాక్షన్ ఎపిసోడ్ ను రైన్ ఎఫెక్టులో లావిష్ గా తీయనున్నారు. హైదరాబాదు, ధూల్ పేట బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. జగపతిబాబు, వడ్డే నవీన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
manchumanoj, rgv, news, tollywood, surabhi, attack,