సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లోనే ఉంటాడు. అటు సినమాలతోనో.. ఇటు వివాదాలతోనో.. రెండూ లేకపోతే ట్వీట్స్ ద్వారా తను వెల్లడించిన అభిప్రాయలతోనో.. కాంట్రవర్సీల కాపురం చేస్తూనే ఉంటాడు. కానీ చాలా ఏళ్ల తర్వాత వర్మ నుంచి ఆయన అభిమానులు ఆశించే స్థాయి అనౌన్స్ మెంట్ వచ్చింది. తన తొలి ఇంటర్నేషనల్ మూవీ 'న్యూక్లియర్' ను.. సర్కార్3 షూటింగ్ ముగియగానే ప్రారంభిస్తున్నట్లు చెప్పాడు వర్మ.
రూ. 340 కోట్ల ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వర్మ డైరెక్ట్ చేయనున్నాడనే ప్రకటన రాగానే.. అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా 'నిజంగా బ్యాక్ విత్ బ్యాంగ్..' అంటూ ట్వీట్ పెట్టాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే దీనికి వర్మ నుంచి ఆన్సర్ కూడా వచ్చింది. 'సార్.. ఒకరోజు రాత్రి మీతో ఫోన్ లో మాట్లాడుతున్నపుడు బాహుబలి ద్వారా నేను పొందిన ఇన్ స్పిరేషన్ గురించి మీకో వాగ్దానం చేశాను. అదే ఈ న్యూక్లియర్. కచ్చితంగా ఈ బ్యాంగ్ ను బ్లాస్ట్(న్యూక్లియర్ మూవీని) చేస్తాను' అంటూ ఆన్సర్ ఇచ్చాడు వర్మ.
ఓ దర్శకుడి నుంచి నేను ఇన్ స్పైర్ అయ్యాను మరో గ్రేట్ డైరెక్టర్ చెప్పడం అనేది చాలా అరుదైన విషయం. అయినా.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడే వర్మకు మాత్రం ఇది చిన్నదే. జక్కన్నకు ఇచ్చిన ప్రామిస్ ని ఇలా నిలబెట్టుకుంటున్నాడన్న మాట రామ్ గోపాల్ వర్మ.