Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 10:12:30
facebook Twitter Googleplus
Photo

స్పైడర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ ప్రశ్నకు ఇండస్ట్రీలో రకరకాల ఆన్సర్స్ వినిపిస్తాయి. దసరా నాటికే రిలీజ్ అని.. మేకర్స్ చెబుతుంటారు. ఇంకా పాటల షూటింగ్ చేయాల్సి ఉండడం.. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీపై గట్టిగా పట్టు పట్టడం వంటివి చూస్తే.. అక్టోబర్ లో కానీ ఈ మూవీ వచ్చే ఛాన్స్ లేదని అంటారు. డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారనే ఇన్నర్ టాక్ కూడా ఒకటి నడుస్తోంది. ఈ మూవీకి టైటిల్ విషయంలో ఎంత టెన్షన్ పెట్టారో.. రిలీజ్ డేట్ విషయంలో కూడా అదే జరుగుతోంది.

అయితే.. స్పైడర్ దర్శక నిర్మాతలతో పాటు.. హీరో మహేష్ బాబు కూడా ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేస్తామని పైకి చెబుతున్నారు. రిలీజ్ డేట్ విషయంలో కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారట. కానీ దర్శకుడు ఓ నిర్ణయానికి వస్తే.. హీరో మరో డేట్ అడుగుతున్నాడట. సెప్టెంబర్ 22న ఎట్టి పరిస్థితుల్లోనూ స్పైడర్ ను రిలీజ్ చేయాల్సిందే అన్నది మహేష్ బాబు ఆర్డర్ అయితే.. సెప్టెంబర్ 27కు ఫిక్స్ అయ్యాడట మురుగదాస్. ఈ విషయంలో హీరో-డైరెక్టర్ ఇద్దరి మధ్య గట్టి వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.

మొత్తం దసరా హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలన్నది మహేష్ బాబు ఆలోచన అయితే.. రెండు భాషల్లో తెరకెక్కి.. పలు భాషల్లో విడుదల అవుతున్న సినిమాను.. కేవలం తెలుగు మార్కెట్ నే దృష్టిలో పెట్టుకుని విడుదల తేదీ నిర్ణయించడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాడట మురుగదాస్.

,  ,  ,  ,  ,