Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2017 15:54:49
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ. మనోడు మామూలు రేంజు ప్లానులు వేయడనుకోండి. అందుకే ఇప్పుడు ఆయన సూపర్ ప్లాన్ అదే అని తెలిసిన వారందరూ షాకైపోతున్నారు. మనోడు రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఒక 5 కోట్ల రూపాయల విలువైన పబ్లిసిటీని ఫ్రీగా కొట్టేశాడు తెలుసా? పదండి చూద్దాం.

నిజానికి ఒక దర్శకుడి గురించి ఒకేసారి చాలా మీడియాల్లోవార్తలు రావాలంటే.. అతను ఏదైనా బాహుబలి రేంజ్ సినిమాలు తీసుండాలి. అయితే మన వర్మ మాత్రం.. సింపుల్ గా ఉమెన్స్ నాడు కాస్త సెక్సిస్ట్ ట్వీటొకటి వేశాడు. సన్నిలియోన్ తరహాలో ప్రపంచంలో మహిళలందరూ ఆనందాన్ని పంచాలని డబుల్ మీనింగ్ ట్వీటుతో ముందుకొచ్చాడు. దెబ్బకి న్యూస్ కాలమ్న్స్ నుండి టివిల వరకు.. రేడియో ల నుండి పేపర్ల వరకు.. ఇతర డిజిటిల్ మాధ్యమాల అన్నింటిలోనూ మనోడే హెడ్ లైన్ అయిపోయాడు.

ఆ తరువాత సదరు ట్వీటుపై సన్ని లియోన్ స్పందించడం.. అలాగే రాఖీ సావంత్ కూడా స్పందించడంతో.. ఇంకా పెద్ద న్యూస్ అయిపోయింది. అలాగే టివి డిబేట్లలో సోనమ్ కపూర్ వంటి స్టార్లు మాట్లాడటంతో.. ఈ న్యూస్ చాలా పెద్దదై రామ్ గోపాల్ వర్మ వార్తల్లోకి ఎక్కేశాడు. నిజానికి ఇలా అన్ని మీడియాల్లోనూ ఒక పెయిడ్ వార్త రాయించుకోవాలంటే.. దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చువుతందట. అదంతా మనోడికి ఫ్రీ ఫ్రీ ఫ్రీ.

,  ,  ,  ,  ,