Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2016 11:19:17
facebook Twitter Googleplus
Photo

హ్యాపీడేస్ సినిమాతో తెలుగులో సూపర్ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కొత్త బంగారు లోకంతో ఇండస్ట్రీలో సెట్ అయిపోయిన హీరో వరుణ్ సందేశ్. గత కొద్ది కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ వస్తోన్న వరుణ్, ఆ దిశగా ఇకపై తన కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కెరీర్ విషయం అలా ఉంచితే వ్యక్తిగత జీవితంలోనూ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవ్వడం ద్వారా వరుణ్ ఓ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు.
?ప్రేమ ఇష్క్ కాదల్? సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించిన వితిక శేరును వరుణ్ పెళ్ళాడనున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. ఇక తాజాగా వీరిద్దరి వివాహానికి కూడా ముహూర్తం ఖరారైపోయింది. ఆగష్టు 18వ తేదీన ఆలంకృత రిసార్ట్స్‌లో వరుణ్ సందేశ్ వివాహం వైభవంగా జరగనుంది. పలువురు సినీ, రాజకీయ సమక్షంలో జరగనున్న ఈ వేడుక వరుణ్ తరపు బంధువులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,