Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Dec-2016 10:50:05
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ మూవీ వంగవీటికి ప్రశంసల సంగతేమో కానీ పెదవి విరుస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. పాతికేళ్లకు మించిన సుదీర్ఘ చరిత్రను రెండున్నర గంటల్లో చూపించడం సాధ్యం కాకపోయినా.. జరిగిన హత్యల చుట్టూ ఉన్న ఎమోషనల్ ఎపిసోడ్స్ ను కాకుండా.. హత్యలు జరిగిన తీరు.. రక్తపాతం-హింసల చుట్టూనే సినిమా నడిపేసి పూర్తి చేశాడు వర్మ.

ఇదంతా ఒక ఎత్తయితే.. సినిమాకు కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని వర్మ తేల్చేయడం కూడా ఎవరికీ నచ్చడం లేదు. వంగవీటి మోహన రంగా హత్యకు బాధ్యులు ఎవరనే విషయాన్ని చెప్పకుండా వదిలేసాడు వర్మ. అసలు రంగా హత్యకు కారకులు ఎవరు అనే పాయింట్ చూపేందుకు వర్మకు ధైర్యం చాల్లేదా అని నిలదీస్తున్నారు. దీనికి ఓ రాజకీయ పార్టీ నుంచి ఈయనకు బెదిరింపులు వచ్చాయనో.. లేకపోతే అదే పార్టీకి వర్మ అనుచరుడుగా మారిపోయాడనే విమర్శిస్తున్నారు.

రంగా హత్యకు బాధ్యులు ఎవరో చెప్పే ధైర్యం ఇప్పుడు వర్మ చేయకపోయినా.. దశాబ్దాల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ ఈ ధైర్యం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సాహసమే నా ఊపిరి చిత్రంలో.. రంగా హత్యకు కారకులను కృష్ణ నేరుగానే చెప్పేశారని.. ఇప్పుడు వర్మకు ఆ పాటి గట్స్ లేకపోయాయని విమర్శిస్తున్నారు విజయవాడ వాసులు.

,  ,  ,  ,