Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 11:57:06
facebook Twitter Googleplus
Photo

బాలకృష్ణ వందో చిత్రం విషయంలో అన్ని ఏర్పాట్లూ శరవేగంగా జరిగిపోతున్నాయి. క్రిష్ కథ చెప్పడమే ఆలస్యం... బాలకృష్ణ ఒప్పుకోవడం వెంటనే సినిమా ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. క్రిష్ ముందుగానే స్క్రిప్టు సిద్ధం చేయడంతో సినిమా పనులు ఒక్కసారిగా వూపందుకొన్నాయి. ఇక సెట్స్ పైకి వెళ్లడమే లేటు అనుకొంటున్న తరుణంలో హీరోయిన్ విషయంలో చిక్కొచ్చిపడింది. మొదట నయనతారని హీరోయిన్ గా ఎంచుకోవాలనుకొన్నారు. కానీ కాల్షీట్లతో సమస్య రావడంతో నయన్ నో చెప్పింది. దీంతో కాజల్ వైపు దృష్టిపెట్టారు. ఆమె చేతిలో సినిమాలేమీ లేవు కాబట్టి ఒప్పుకుటుందని ఊహించారంతా. కానీ ఆమె కూడా తన గురువులాంటి తేజ సినిమాలో నటించేందుకు కాల్షీట్లు ఇచ్చేసింది. సో... కాజల్ కూడా చేతులెత్తేసినట్టే.

ఇక ఆ పాత్రకి సరిపడా కథానాయిక అంటే ఒక్క అనుష్క మాత్రమే అని క్రిష్ భావిస్తున్నాడట. కానీ బాలయ్య మాత్రం ఇప్పుడు నాకు నయనతారే కావాలంటున్నాడట. అనుష్కకీ తనకీ సెట్టవ్వదనీ కెమిస్ట్రీ కుదరకపోవచ్చని బాలయ్య అంటున్నాడట. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో క్రిష్ ఉన్నాడట. మరి నయనతార కాల్షీట్లే సర్దుబాటు చేయిస్తారా లేదంటే మరో ప్రత్యామ్నాయం వెదుక్కుంటారా అన్నది చూడాలి. కాజల్ ని కూడా మరోసారి సంప్రదించి కాల్షీట్లు సర్దుబాటు చేయించాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ సెట్టయినా అవ్వకపోయినా ఈ నెలాఖరున మాత్రం రంగంలోకి దిగాల్సిందే అని క్రిష్ డిసైడ్ అయ్యాడట. `గౌతమీపుత్ర శాతకర్ణి` పేరుతో రాబోతున్న ఆ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,  ,