Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jan-2017 11:11:36
facebook Twitter Googleplus
Photo

యండమూరి వీరేంద్రనాథ్ అన్నట్లుగా మెగా అభిమానుల్ని పెద్ద సంఖ్యలో చూసేసరికి నాగబాబుకు ఆవేశం వచ్చేసి ఉండొచ్చు. అన్నయ్య మీద ప్రేమతో కొంచెం హద్దులు దాటి మాట్లాడి ఉండొచ్చు. ఆయన అన్న మాటల ఆంతర్యం ఏమైనా.. ఆయన ఉపయోగించిన భాష అభ్యంతరకరమే. దానికి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇవ్వడం వరకూ ఓకే. వర్మ కౌంటర్లు కొందరికి కాక తెప్పించాయి. కొందరు వాటిని బాగా ఎంజాయ్ చేశారు. కొందరు తటస్థంగా ఉన్నారు. ఐతే కౌంటర్లు వేయడానికి.. ఒకరిపై ఎదురుదాడి చేయడానికి కూడా ఒక హద్దుండాలి. అదే పనిగా మోత మోగించేస్తే జనాలకు మొహం మొత్తేయడం ఖాయం. ఇప్పుడు వర్మ విషయంలో జనాల ఫీలింగ్ అదే.

నాగబాబు వ్యాఖ్యల తర్వాత వర్మ కౌంటర్లను ఎంజాయ్ చేసిన జనాలకు కూడా ఆయన మరీ శ్రుతి మించి పోయేసరికి చిరాకొచ్చేసింది. ముందు రోజు అర్ధరాత్రి దాకా వరుసగా ట్వీట్లు గుప్పిస్తూనే ఉన్నాడు వర్మ. ఉదయం లేచి కొన్ని కోట్స్ ఏవో పెట్టాడు. సాయంత్రానికి ఆయన ఫోకస్ ?గౌతమీపుత్ర శాతకర్ణి? మీదికి మళ్లింది. ఆ ట్వీట్లు కూడా నాగబాబును.. మెగా అభిమానుల్ని ఉడికించడానికే పెట్టాడన్న సంగతి జనాలకు అర్థమైంది. ఐతే మధ్యలో రానా ?ఖైదీ నెంబర్ 150? గురించి ఏదో పాజిటివ్ కామెంట్ పెడితే.. ఈ ట్రైలర్ ?ఫెంటా.....స్టిక్? అని వ్యాఖ్యానించడంలో వర్మ ఉద్దేశమేంటో అందరికీ తెలుసు. అంతటితో ఆగకుండా రాత్రి మళ్లీ నాగబాబును కెలికే ప్రయత్నం చేశాడు.

నిన్నంతా అలా అరిచి గీపెట్టిన నాగబాబు ఈ రోజు సైలెంటైపోయాడేంటి.. తేలు కుట్టిందా? వానపాము కుట్టిందా..? అంటూ వ్యాఖ్యానాలు చేయడం టూమచ్. దీంతో మెగా అభిమానుల కోపం తీవ్ర స్థాయికి చేరింది. జనాల్లో మరీ ఇంత అసహనం కలిగించడం అన్నది సమంజసం కాదు. ఓ వర్గాన్ని అదే పనిగా టార్గెట్ చేసుకుని.. వారి మద్దతుదారుల్ని.. అభిమానుల్ని మరీ అంతలా రెచ్చగొడితే తీవ్ర పరిణామలు ఎదురు కావచ్చు. అందరికీ విచక్షణ ఉండదు. విజ్నతా ఉండదు. కాబట్టి వర్మ ఇప్పటికైనా ఈ గొడవను ఇంతటితో వదిలేస్తే మంచిదన్నది అందరి అభిప్రాయం.

,  ,  ,  ,  ,