Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jan-2015 11:00:05
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ మంచు వారి కుటుంబ దర్శకుడిగా స్థిరపడిపోయేలా వున్నాడు. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు, లక్ష్మిలతో కొన్ని సినిమాలు చేసిన ఈ దర్శకుడు, ఇప్పుడిక మంచు మనోజ్ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. వర్మతో ఓ చిత్రం చేయాలన్న కోరికను మనోజ్ వ్యక్తం చేయగానే వెంటనే ఆయన ఓ కథను చెప్పాడట. అది అందరికీ నచ్చడంతో స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు. త్వరలో ఇది సెట్స్ కి వెళుతుందనీ, ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందనీ సమాచారం. మనోజ్ ని ఇందులో వర్మ సరికొత్త స్టయిల్ లో చూపిస్తాడట.

,  ,  ,  ,