Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2017 15:24:40
facebook Twitter Googleplus
Photo

బాక్సింగ్ మానేసి మోడలింగ్ అంటూ అడుగులు వేసి.. చివరకు గురు సినిమాతో హీరోయిన్ అయిపోయింది రితికా సింగ్. అమ్మడుకు ఇప్పుడు హీరోయిన్ గా మాంచి చాన్సులు వస్తాయనే అందరూ అనుకుంటున్నారు. అయితే ముందు అమ్మడు ఇదే సినిమాను తమిళంలో చేసింది కాబట్టి.. వెంటనే అక్కడ లారెన్స్ తన సినిమాలో ఛాన్సిచ్చేశాడు. అందమైన అమ్మాయిలను దెయ్యాలుగా మార్చాలంటే తెగ సరదా కదా.. మార్చేశాడు.

లక్ష్మీ రాయ్.. తాప్సీ లను ఎలాగైతే భయపెట్టే భయంకరమైన దెయ్యాలుగా చూపించాడో.. ఇప్పుడు సేమ్ రితిక సింగ్ పరిస్థితి కూడా అంతే. నిన్న రిలీజైన శివలింగ సినిమాలో రితిక హీరోయిన్ గా చేసింది. పాటల్లో బీభత్సమైన గ్లామర్ ఆరబోసింది అని అందరూ సినిమాకు వెళ్ళేవరకు చెప్పుకున్నారు. కాని సినిమాలోపల మాత్రం.. అమ్మడు భయంకరమైన నటనాకౌసల్యం చూపించేసి.. తన భయంకర మేకప్ తో భయపెట్టేసింది. ఒక ధియేటర్లో (గురు సినిమా) నాటు పిల్లగా అలరించి బాక్సింగ్ చేసిన ఈ బ్యూటి.. మరో ధియేటర్లో (శివలింగ) ఇలా భయపెట్టడం తగునా.

ఇకపోతే రితిక ఇప్పుడు తెలుగులో కూడా పెద్ద హీరోయిన్ అయిపోవాలనే ప్రయత్నిస్తోంది.

,  ,  ,  ,  ,  ,